హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికన ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. “విలువలతో కూడిన సైద్ధాంతక ప్రయాణానికి నిలువెత్తు రూపం, అలుపెరుగని కార్యదక్షతతో ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా, ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ బండి సంజయ్ ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు.

ఇక జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తనపై నమ్మకం ఉంచి కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండో సారి భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే ఈ రోజు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపునకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version