రేవంత్ కు సహాయ మంత్రిగా బండి సంజయ్ పని చేస్తున్నారు : ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

-

రేవంత్ కు సహాయ మంత్రిగా బండి సంజయ్ పని చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో అంత షాడో మంత్రుల దందా నడుస్తుంది. కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయి. సుంకిశాల ప్రమాదం పై బీఆర్ఎస్  పార్టీ పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచింది. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనలో ఇప్పటి వరకు సమాధానం లేదు. నిర్మాణం సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశాం. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

స్టేట్ లో ప్రభుత్వం కంటే సోషల్ మీడియా వేగవంతంగా పని చేస్తోంది. ప్రమాదం పై మంత్రుల మాటలకు పొంతన లేదు. పెద్ద విపత్తు జరిగింది. నష్టం వాటిల్లింది కేంద్ర మంత్రి, బీజేపీ నేతలు దీనిపైన మాట్లాడరు. తెలంగాణ ఫైనాన్స్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయి వీటిపైన మాట్లాడరు. బిల్లుల జారీ అంశంలో 7 శాతం ఒకచోట , 1 శాతం మరో చోట అంటూ దోచుకుంటున్నారు. స్కూల్ విద్యార్థులు మరణిస్తే.. బీజేపీ నేతలు దీని పైన మాట్లాడరు. లా అండ్ అడర్ రాష్ట్రంలో గాడి తప్పింది దీనిపైన బిజెపి నోరు విప్పది. కుక్కలు దాడులు చేస్తున్నాయి వీటిపైన కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మాట్లాడరు. బండి సంజయ్ కేటీఆర్ పై మాట్లాడిన మాటలపై ప్రధానికి, కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం పట్ల అవగాహన లేనట్టు బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version