ఢిల్లీ సీఎంగా కల్వకుంట్ల కవిత.. బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌

-

ఢిల్లీ సీఎంగా కల్వకుంట్ల కవిత..కాబోతున్నారని బీజేపీ ఎంపీ, సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. పరేడ్ మైదానంలో యువకులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడిన బీజేపీ ఎంపీ, సహాయ మంత్రి బండి సంజయ్‌.. అనంతరం కేజ్రీవాల్ రాజీనామాపై స్పందించారు.

bandi sanjay on kavitha over delhi cm

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని అక్కడ సీఎం చేసినా చేయొచ్చు అంటూ సెటైర్లు పేల్చారు బీజేపీ ఎంపీ, సహాయ మంత్రి బండి సంజయ్‌. లిక్కర్ స్కామ్ లో పార్ట్నర్లను సీఎంను చేసిన చేయొచ్చు చురకలు అంటించారు.

నిజాం పాలనలో రజకార్ల దళం తెలంగాణ ప్రజలను ఊచ కోత కోసింది. మహిళలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించిందని ఆగ్రహించారు. పరకాల, బైరాన్ పల్లి, గుండ్రాంపల్లిలో వందల మందిని బలి తీసుకుందని మండిపడ్డారు. అలాంటి రజకార్ల దళం పార్టీగా ఏర్పడితే… ఆ పార్టీ వారసుడైన ఒవైసీని సీఎం పొగడటం వెనుక ఉద్దేశమేంది? జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేటోళ్లకు వత్తాసు పలకడమంటే కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version