ఒవైసీకి దమ్ముంటే…. తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్. హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ పెడతామంటే ఖబడ్దార్….హిందువులను కించపరిస్తే బట్టలూడదీసి ఉరికించి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకు ముందు బిచ్చమెత్తుకునే స్థాయినుండి…వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్ కేసీఆర్ ?అని నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్.
కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలున్నాయా? అని నిలదీశారు. 1400 మంది పేదలు చస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలది ఫినాయిల్ బంధం అన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ ఓ కిరాణా దుకాణం అని… గెలిచినోళ్ళంతా పోయేది బీఆర్ఎస్ లోకే అని తెలిపారు.