హరీశ్ రావు, కేటీఆర్ పై బండ్ల గణేష్ ఫైర్..!

-

గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. నిన్నటితో ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకుందని.. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారని కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కాంగ్రెస్ కు వచ్చిందని.. ఈర్ష పిక్ స్టేజ్ కి చేరుకోవడంతోనే రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పది సంవత్సరాలు ఏం చేశారు? తెలంగాణకి రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా? అని పలు ప్రశ్నలు సంధించారు.  తెలంగాణకి రావలసిన నిధుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి.. ప్రధానమంత్రి మోదీ , కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ పోరాటం చేస్తున్నారన్నారు. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని హరీష్ రావ్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. అవినీతి అధికారులను పక్కకు తప్పుంచి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటూ కీర్తించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఒక్క స్థానం కూడా గెలవరని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version