తెలంగాణ బిడ్డనే అంటూ.. బతుకమ్మ ఆడిన వైఎస్ షర్మిల..వీడియో వైరల్

-

తెలంగాణ బిడ్డనే అంటూ.. బతుకమ్మ ఆడి,పాడింది వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నాతోటి ఆడబిడ్డలు, సోదరీమణులతో కలిసి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల పేర్కొన్నారు. బతుకమ్మ దీవెనలతో మన భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకుంటూ మరోసారి పూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక అటు సంగారెడ్డి కలెక్టర్ పై సంచలన ట్వీట్‌ చేశారు షర్మిల. సంగారెడ్డి కలెక్టర్ TRS కండువా కప్పుకొని డ్యూటీ చేస్తున్నాడా? KCR అంబేడ్కర్ లా నీ కంటికి ఎలా కనిపించాడు నాయనా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించినందుకా? దళితున్ని ముఖ్యమంత్రిని చేయనందుకా? మూడెకరాల భూమి ఇవ్వనందుకా? దళితుల భూములు గుంజుకున్నందుకా? అని నిలదీశారు.

రోజుకో పార్టీ మారే ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నేను BJP వదిలిన బాణాన్ని అంటూ నరం లేని నాలుకలా మాట్లాడుతున్నాడు.అయ్యా! జగ్గారెడ్డి.. నేను వైఎస్సార్ వదిలిన బాణాన్ని. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి వచ్చిన బాణాన్ని.. నీకు చేతనైతే హామీలు నెరవేర్చని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version