షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకుంటే తప్పేంటి ? – భట్టి హాట్ కామెంట్స్

-

సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు. షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్పేంటి. షర్మిలది మొదటినుండి కాంగ్రెస్ ఫ్యామిలీ. షర్మిలను కాంగ్రెస్‌లోకి వద్దు అనే వాళ్ళది వ్యక్తిగత అభిప్రాయం అన్నారు భట్టి విక్రమార్క.

కాగా, ఈ ఏడాది మార్చి 16న భట్టి… పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌ రావు ఠాక్రే ప్రారంభించారు. మార్చి 19న ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించగా ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మండే ఎండలు, వర్షాలు, ప్రతికూల పరిస్థితులను లెక్క చేయకుడా భట్టి పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version