విద్యుత్ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపిన భట్టి విక్రమార్క..!

-

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అధికారులతో మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు నేపద్యంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడ అంతరాయాలు లేకుండా చూడాలని సంబంధిత ఎస్ ఈ లను ఆదేశించారు . నీట మునిగిన సబ్ స్టేషన్ ల వివరాలను తెలుసుకొని ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని, సరఫరా స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

విపత్తులో ముందుగా నష్టపోయే శాఖ విద్యుత్ శాఖ ఉంటుంది కాబట్టి సిబ్బంది అందరు 24/7 అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరా లేని చోట అందించాలని కోరారు . వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నయని, చెట్లు విరిగి స్థంబాలు దెబ్బతిన్నచోట, ఇన్సులేటర్లు ఫెయిల్ అయిన వాటిని యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేయాలన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్ పోలీస్ రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం పునరుద్ధరణ పై  ఎస్ఈ లతో ఎప్పటికప్పుడు సమక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించిన డిప్యూటీ సీఎం.. సామాజిక బాధ్యతను విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించే విద్యుత్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అర్థరాత్రి లను సైతం లెక్కచేయకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేయుటకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బందిని ప్రశంశించారు. ఉద్యోగ ధర్మం కాకుండా సమాజ సేవ భావంతో పనిచేస్తున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version