Polala Amavasya 2024: హిందూ మత విశ్వాసాల ప్రకారం పొలాల అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ పెళ్లయిన మహిళలు సంతానం కోసం పిల్లలు యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను చేస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి సెప్టెంబర్ 2న పొలాల అమావాస్య వచ్చింది. శుభ ముహూర్తం గురించి, ఈ వ్రతం ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 2న పోలాల అమావాస్య వచ్చింది. తెల్లవారుజామున 4:38 గంటల నుంచి ఉదయం 5:24 గంటల వరకు స్నాన సమయం. పూజ సమయం వచ్చేసి ఉదయం 6:09 గంటల నుంచి 7:44 గంటల వరకు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సూర్యాస్తమయం ముందు వరకు శ్రార్ధ సమయం.
పూజ గదిలో కంద మొక్కను పెట్టుకోవాలి, ఆ మొక్కకి తొమ్మిది పసుపుకొమ్ములు కట్టాలి. ముందుగా వినాయకుని పూజించి తర్వాత కంద మొక్కకి పూజ చేయాలి. మంగళ గౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆవాహనం షోడశోపచార పూజలు చేయాలి. పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి. చుట్టుపక్కల ఇళ్ల నుంచి కూరగాయల్ని అడిగి తీసుకుని వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.
పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పిల్లలు వృద్ధి చెందుతారు. పిల్లలు పుట్టని వాళ్లు ఈ పోలాల అమావాస్య పూజలు చేసుకోవడం వలన పిల్లలు కలుగుతారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో చివరి రోజున ఈ పోలాల అమావాస్య పూజ చేస్తారు. ఈ పూజకు కథ కూడా ఉంటుంది. ఆ కథను చదివి అక్షింతలు వేసుకుంటారు.