సెక్రటేరియట్ కి రాకుండా దేశంలో పని చేసిన ఏకైక సీఎం కేసీఆర్ : భట్టి విక్రమార్క

-

సెక్రటేరియల్ కు రాకుండా దేశంలో పని చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలు ముఖ్యం కాదు.. ధరణి లాంటి కుంభకోణ పథకాలే ముఖ్యం అని తెలిపారు. దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పోరాడితే.. కాళేశ్వరం నిర్మాణం పేరిట ఆర్థిక దోపిడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నిర్మాణం చేసిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు పనికిరాని పున:నిర్మించాలని వాస్తవాలు బయటపెట్టిన డ్యామ్ సేప్టీ అధికారులు. కాళేశ్వరం ప్లాన్ ప్రకారం.. చేసిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరుగలేదని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట 1,60,000కోట్లు దోపిడీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అలంకారప్రాయంగా మారిన మిషన్ భగీరథ ట్యాంకులు పైపులు.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లను చూడలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version