కాంగ్రెస్ సర్కారుకు బిగ్‌షాక్..అశ్వారావు పేట మీటింగ్‌కు రైతుల డుమ్మా!

-

కాంగ్రెస్ పార్టీకి భారీ బిగ్ షాక్ తగిలింది. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో దర్శనమిస్తున్నాయి. నిన్నగాక మొన్న నల్గొండలో అర్ధరాత్రి బస్సులో చెకింగ్ అధికారులు ఆధార్ కార్డులు తనిఖీలు చేసినందుకు గాను తమకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని స్వయంగా మహిళలే ఫైర్ అయ్యారు.

తాజాగా అశ్వారావుపేటలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో రైతులు లేకుండానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడాల్సి వచ్చింది. నియోజకవర్గంలో మంత్రుల కార్యక్రమానికి రైతు రుణమాఫీ, రైతుబంధు ఎఫెక్ట్ భారీగానే పడిందని స్థానిక లీడర్లు మాట్లాడుకుంటున్నారు. అశ్వరావుపేటలో నెలకొల్పిన పామాయిల్ ఫ్యాక్టరీలో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించేందుకు రాగా, ఈ కార్యక్రమాన్ని రైతులు బాయ్‌కాట్ చేసి నిరసన తెలిపారు.భోజనాలు సైతం సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సీరియస్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version