కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకం: డీకే అరుణ

-

కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపాలో చేరేందుకు చాలామంది నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏ సమయంలో చేర్చుకోవాలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో జగన్, కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారని డీకే అరుణ అన్నారు. 2019 ఎన్నికల్లోనూ ఏపీలోనే షర్మిల ప్రచారం చేశారని గుర్తు చేశారు. మరి ఏపీలో ఎందుకు పోటీ చేయట్లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. అన్నా చెల్లెల్లు కుమ్మక్కై తెలుగు రాష్ట్రాలను తమ చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని అరుణ ఆరోపించారు. కానీ భాజపా వాళ్ల ఆటలు సాగనీయదని స్పష్టం చేశారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని డీకే అరుణ వెల్లడించారు. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి.. నివాళులతో స్మరించుకోవాలని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరుతో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దేశభక్తిని, జాతీయభావాన్ని అందరం క‌లిసి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version