గోషామహల్‌ టికెట్‌ నాదే : BJPనేత విక్రమ్‌ గౌడ్‌

-

రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ ఆశావహులు తమకు టికెట్ వస్తుందో రాదోననే అయోమయంలో ఉన్నారు. కొందరైతే తప్పకుండా తమకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.  మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ తనయుడు, బీజేపీ నేత విక్రమ్‌ గౌడ్‌ కూడా అదే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ గౌడ్ తో బీజేపీ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు.  ఎంజే మార్కెట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. గోషామహల్‌ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై సుదీర్గంగా చర్చించారు. మొన్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని, ఈరోజు విక్రమ్‌ గౌడ్‌ని ఈటల రాజేందర్‌ కలవడంపై గోషామహల్‌లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

గోషామహల్‌ టికెట్‌ తనదేనని ఈటలతో భేటీ అనంతరం విక్రమ్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరతానని చెప్పారు. తన కుటుంబానికి గోషామహల్‌ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version