బిజెపి నేతలు తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేరు – కూనంనేని

-

బిజెపిపై తీవ్ర స్థాయిలో పండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మంలోనే కాదు.. తెలంగాణలో ఎక్కడా గెలవలేరని అన్నారు. ఖమ్మం సీటును గెలుచుకునేది తామేనంటూ బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కూనంనేని.

కులం, మతం పేరుతో రాజకీయాలు చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తెలంగాణలో బిజెపి ప్రభావం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లో లాభనష్టాలు రెండు ఉన్నాయని.. అందులోని లోపాలను సరిదిద్దుతే రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించి పాలకులు సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version