ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ మహిళలకు ఏం చేసింది – హరీష్ రావు

-

బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మహిళా సంక్షేమ సంబరాలలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పుట్టినరోజు జరుపుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మహిళలకు ఏం చేసింది..? అని ప్రశ్నించారు హరీష్ రావు.

వేసవిలో కూడా ఇంటింటికి నీరు అందడానికి సీఎం కేసీఆర్ కృషి కారణమన్నారు. గుజరాత్ లో రెండు రోజుల పవర్ హాలిడే ఉంటే.. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఐటి టవర్ రావడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version