లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా నేడు బీజేపీ వర్క్‌షాప్‌

-

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరున రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదిలాబాద్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్‌లుగా విభజించగా కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు మరో ప్రాంతంతో కలిపి 3 క్లస్టర్‌ సమావేశాల్లో అమిత్‌ షా పాల్గొంటారు. మిగిలిన 2 క్లస్టర్‌ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు.

 

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఇవాళ మీడియా వర్క్‌ షాప్‌ను నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ నేత సయ్యద్ జాఫర్ ఇస్లాం ఈ వర్క్‌షాప్‌ ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతం సహా పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహాలు, విధివిధానాలపై నాయకులతో చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాధిత్య సింధియా హాజరవుతారు. పార్టీ విధివిధానాలు, మీడియా విభాగం నిర్వహించే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version