ఇండియా కూటమిలో బీఆర్ఎస్​ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ యత్నం : ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడిందని.. కానీ తొమ్మిదన్నరేళ్లలో నిరుద్యోగుల ఆశపై కేసీఆర్‌ నీళ్లు చల్లారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. రాష్ట్రం వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటోందని వాపోయారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ ను చేర్చుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోందని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ను ఆడించేది ఎంఐఎం పార్టీ అని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రమే నిర్వహించిందని.. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో చేసిందని చెప్పారు.

“తెలంగాణకు 3 వందే భారత్‌ రైళ్లును కేంద్రం ఇచ్చింది. దేశంలోనే ఎక్కువ హైవేలు తెలంగాణలోనే ఉన్నాయి. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ బీజేపీ. 52 శాతం ఉన్న బీసీలు ఓట్లు వేస్తే బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కోరుకుంటున్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే చూపిస్తాం.” అని లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version