నేడు గజ్వేల్‌లో బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్ రెడ్డి పర్యటన

-

నేడు గజ్వేల్‌లో బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌ రెడ్డి పర్యటించనున్నాడు. బీజేపీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం కేసీఆర్‌ నియోజక వర్గమైన గజ్వేల్‌ లో తొలి టూర్‌ చేస్తున్నాడు బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌ రెడ్డి. ఈ మేరకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసారు.

కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అహంకార, అవినీతి, అక్రమ పాలనకు చరమగీతం పాడేందుకు.. తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రిజి.కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. శుక్రవారం సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో కీలకాంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version