నవంబర్ 1న బీజేపీ రెండో జాబితా?

-

మలి విడత అభ్యర్థుల జాబితాపై బిజెపి కసరత్తు మొదలుపెట్టింది. నవంబర్ 1న జరగనున్న ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ జాబితాను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అదే రోజు లేదా 2న జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో ఎవరిని పోటీకి నిలబెట్టేది కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతే స్పష్టత వస్తుందని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులను ప్రకటించింది.

First list of BJP candidates released today

కాగా, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవలే జనసేన పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే ఆ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందనే ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇవాళ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version