“తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడెళ్ళినావు కొమురయ్యా” అంటూ బలగం సినిమా క్లైమాక్స్ లో వచ్చే పాటని మీరంతా వినే ఉంటారు. ఆ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య రావడంతో హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు మొగిలయ్య. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది మొదలయ్య భార్య కొమరమ్మ. ఆయనకి కరోనా సమయంలోనే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయన అప్పటినుండి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల బీపీ, షుగర్ పెరగడంతో ఆయన రెండు కళ్ళపై ఎఫెక్ట్ పడింది. తాజాగా తీవ్ర అస్వస్థకి గురయ్యారు.