శివరాత్రి పండుగ…కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ మొట్టమొదటి కేసీఆర్. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలుండాలని ప్రార్థించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాసదీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. దేశ వ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణో మారుమోగుతాయన్నారు. గరళాన్ని తన కంఠంలో దాసుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమా శంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకుండాలని, సుఖ శాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ఆ మహాశివున్ని ప్రార్థించారు.