బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే..!

-

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన మ్యానిఫెస్టోను ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ ఏర్పాటు చేయనున్నారు. సాామాజిక పెన్షన్లు రూ.5వేలకు పెంపు.

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో :

  • తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణి,
  • మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ సంక్షేమం..
  • దళితబంధును కొనసాగిస్తాం
  • రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయం
  • మైనార్టీ జూనియర్ కళాశాలకు డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం
  •   తెల్ల రేషన్ కార్డు దారులకు త్వరలో కేసీఆర్ బీమా ప్రతీ ఇంటికి ధీమా పథకం..
  • రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా
  • సామాజిక పెన్షన్లు రూ.5వేలు పెంపు
  • దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు పెంపు
  • రైతు బంధు రూ.16వేల వరకు పెంపు
  • సౌభాగ్య లక్ష్మి పథకం.. మహిళలకు 3వేల బృతి. 
  • అర్హులైన లబ్దిదారులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్.
  • అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
  • హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు
  • అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ
  • అసైన్డ్ భూములకు పట్టాలు
  • ఓపీఎస్ డిమాండ్ పై కమిటీ నియామకం.
  • గిరిజనులకు పోడు భూముల పట్టాలు.. వారికి రైతుబంధు, రైతు బీమా సౌకర్యం
  • అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం
  • ఇంటి స్థలం లేని పేదలకు ఇండ్ల స్థలాలు
  • ఆరోగ్య శ్రీ పరిధి రూ.15లక్షలకు పెంపు
  • ఇంతకు ముందు కొనసాగుతున్న పథకాలు యధావిధిగా కొనసాగుతాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version