ఇజ్రాయెల్‌కు కొనసాగుతున్న అమెరికా మద్దతు.. మధ్యధరా సముద్రంలోకి మరో విమాన వాహక నౌక

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాపై ఇజ్రాయెల్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. గాజాను అష్టదిగ్బంధనం చేసి హమాస్​ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రతిన పూనింది. గాజాలో సంక్షోభం వేళ ఇజ్రాయెల్​కు పూర్తి మద్దతు తెలిపిన అమెరికా తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరించింది.

మరోవైపు టెల్‌అవీవ్‌కు అమెరికా పూర్తి మద్దతు తెలుపుతూ.. అగ్రరాజ్యం నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం అందుతోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో మూడో దేశం జోక్యం చేసుకోకుండా అరికట్టేందుకు ఈ నౌకను అమెరికా పంపినట్లు శ్వేతసౌధం తెలిపింది. యూఎస్‌ఎస్‌ ఐసన్‌హోవర్‌ తన క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌తో ఇజ్రాయెల్‌ తీరానికి తరలించినట్లు వెల్లడించింది. ఇప్పటికే అక్కడ ఉన్న ద యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వాహక నౌక బృందంతో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ గ్రూప్‌లో డిస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు, ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. మరోవైపు హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న భీకర పోరులో ఇరువైపుల దాదాపు 3,500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న ప్రతిదాడిలో 2,200 మందికి పైగా గాజా పౌరులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version