బీఆర్ఎస్ కి ఆ విషయం పై కూడా అవగాహన లేదా..? : భట్టి

-

బీఆర్ఎస్ కి కనీసం  ఆ విషయం పై కూడా అవగాహన లేదా..? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీ లోని మీడియా పాయింట్ వద్ద ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ జరిగిందని వెల్లడించారు. బీఏసీలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. పదేళ్లు పాలించిన లీడర్లకు ఈ విషయం కూడా తెలియదా..? అన్నారు. హరీశ్ రావు చెప్పినట్టు సభ పని దినాలు ఉండాలంటే ఎలా..? అని మండిపడ్డారు. తాను ఎల్వోపీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసింది నాకు తెలియదా..? అని సీరియస్ అయ్యారు భట్టి.

Deputy CM Bhatti

ఇప్పుడు కూడా సభ ఎన్ని రోజులు జరపాలనేది స్పీకరే డిసైడ్ చేస్తారని తెలిపారు. అంతకు ముందు మండలిలో ఉద్యోగ ఖాలీలు అంచెనా వేసి TGPSC ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్టు తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version