బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు హాజరయ్యారు. ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నేతకే ఉంటుందని.. భవిష్యత్ లో బీఆర్ ఎస్ ఖతం అవుతుందని ముందే తెలుసుకొని సభకు రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సభలో ఎంత అరచి గీ పెట్టినా ఉపయోగం ఉండదన్నారు మంత్రి కోమటి రెడ్డి.