16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. సిద్ధంగా ఉండాలన్న మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని పెంచింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థి జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోపై తాజాగా కీలక ప్రకటన చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అక్టోబర్ 16వ తేదీన వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభలోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల ప్రకటించనున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వరంగల్ సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాం. శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండండి. ఈసారి ప్రతిపక్షాలు మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది అని తెలిపారు. మరోవైపు టీపీసీసీ రేవంత్ రెడ్డి పై మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెల్లడం ఖాయం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. డబ్బులు పంచి గెలవాలని రేవంత్ చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version