రాష్ట్ర చిహ్నం మార్పుపై మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం: కడియం శ్రీహరి

-

‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా కేబినెట్‌ ఆమోదించిందని, అది మంచి పరిణామమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర చిహ్నం మార్పుపై తాము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. పథకాల పేరు మార్చుతున్నారని, దానికీ ఇబ్బంది లేదని కానీ కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి చిహ్నాలు అని.. వాటిని తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కాకతీయ తోరణం, చార్మినార్‌ కేసీఆర్‌ కట్టింది కాదని స్పష్టం చేశారు.

జయ జయహే తెలంగాణ గీతంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ ప్రాశస్త్యాన్ని కడియం శ్రీహరి కొనియాడారు. మంత్రివర్గం ఆమోదించిన రాష్ట్ర గీతంలో చిహ్నాలు చెరిపివేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నాంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను రాజరికపు ఆనవాళ్లు అంటున్నారన్న కడియం.. అధికారిక చిహ్నాంలో ఉన్న నాలుగు సింహాలు ఎక్కడినుంచి వచ్చాయని రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. అశోక ధర్మ చక్రం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించిన కడియం.. నాలుగు సింహాలు, అశోక ధర్మ చక్రం రాజరిక ఆనవాళ్ల కాదా? అని నిలదీశారు. పంద్రాగస్టు రోజు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేస్తాం.. అది రాచరికపై ఆనవాళ్లు కావా? అని అడిగిన ఎమ్మెల్యే.. కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ అస్థిత్వాన్ని అవమానించవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version