సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతా?: రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ శాసనసభలో బడ్జెట్పై చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో కేసీఆర్ వాడిన భాషపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఒక రాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతా అని ప్రశ్నించారు. నల్గొండలో కేసీఆర్‌ వాడిన భాషపై చర్చిద్దామా? అని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. బీఆర్ఎస్ బుద్ధి మారలేదని విమర్శించారు.

“మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా? సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్‌, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో నీరు నింప్పి.. అన్నారం, సుందిళ్లకు ఎత్తిపోసే బాధ్యతను అప్పగిస్తాం. మేడిగడ్డ కుంగిపోయి కుప్పకూలుతుంటే నీరు నిప్పంటం ఎలా సాధ్యమవుతుంది. కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా అయ్యింది. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా పారిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్‌ సభకు వస్తే రేపు సాయంత్రం వరకు చర్చిద్దాం. అవినీతి బయటపడుతుందనే పారిపోయి ఫాంహౌస్‌లో వెళ్లిపోయారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. ప్రతిపక్ష నేత బాధ్యతను తప్పించుకున్నారు. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది.” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version