నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ప్రారంభమైన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దేదినేని పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా దేదినేనిపల్లిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నియెజకవర్గంలో రెండు రోజుల పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలు దృష్టికి తెచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాలకు సరిపోను వనరులు, సంపదను బిఆర్ఎస్ పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యం, నమ్మి తెచ్చుకున్న తెలంగాణ నిర్మాణం నెహ్రు బాటలో కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. బి.ఆర్.ఎస్ దోపిడీ, అవినీతి పై పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు బట్టి. కృష్ణ, గోదావరి నదులపై జలయజ్ఞం ద్వారా చేపట్టినప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి, రంగారెడ్డి జిల్లా వరకు నీరు అందిస్తామన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు.