ఈనెల 10న సీఎం రేవంత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రైతు దీక్ష

-

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఈ నెల 10వ తేదీన బిఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఈ దీక్ష నిర్వహించనుంది.

జనవరి 28న కూడా నల్గొండలో రైతు దీక్ష చేపట్టారు కేటీఆర్. తాజాగా కొడంగల్ లో మరోసారి రైతు దీక్ష చేపట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల రైతులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతుల కష్టాలు తెలుసుకొని, రైతులకు అండగా ఉండాలని ఈ రైతు దీక్షలు చేపడుతున్నట్లు బిఆర్ఎస్ పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతుందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. బీఆర్ఎస్ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు కొడంగల్ లో రైతు దీక్ష నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇస్తారా..? లేక మళ్ళీ హైకోర్టు కి వెళ్ళవలసి వస్తుందా వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version