కాంగ్రెస్‌ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం !

-

కాంగ్రెస్‌ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. కాసేపట్లో తెలంగాణ భవన్ లో శేరిలింగంపల్లి నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

BRS sensational decision against 10 MLAs who joined Congress

అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే..కాసేపట్లో తెలంగాణ భవన్ లో శేరిలింగంపల్లి నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో క్యాడర్ ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పడింది. కొత్త నాయకత్వాన్ని తయారుచేయటంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version