తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్‌..TTD క్లారిటీ ఇదే

-

A packet of tobacco in Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్‌ ఉందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్‌ ఉందన్న వార్తలపై..TTD క్లారిటీ ఇచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదంలో పొగాకు ప్యాకెట్‌ ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి ప్రకటించింది.

A packet of tobacco in Tirumala Laddu Prasadam

వైష్ణవ బ్రాహ్మణులు నిష్ఠతో లడ్డు ప్రసాదం తయారు చేస్తారని తెలిపింది. సిసి కెమరాలో పర్యవేక్షణలో ప్రసాదం తయారు చేస్తారని TTD క్లారిటీ ఇచ్చింది. కాగా తాజాగా లడ్డులో పొగాకు పొట్లం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా గొల్ల గుడెంలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకొని, తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా..ఆ ల‌డ్డూలో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version