రైతుల కోసం BRS మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహేశ్వరం నియోజకవర్గంలో రైతు ధర్నా కు పిలుపునిచ్చింది brs పార్టీ. సబిత ఇంద్రారెడ్డి ఆద్వర్యం లో రైతు ధర్నా కు brs వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు హాజరుకానున్నారు. మరి కాసేపట్లో రైతు ధర్నా కు హాజరు కానున్నారు కేటీఆర్. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2లక్షల రుణమాఫీ డిమాండ్ తో రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న brs….రైతుల కోసం BRS మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఇక అటు బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? అంటూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా ? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా ? అని ప్రశ్నించారు కేటీఆర్. చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? అని మండిపడ్డారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు కేటీఆర్.