తెలంగాణకు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఇతర ఎయిర్ పోర్టుల నిర్మాణానికి మేము ప్రణాళికలు రెడీ చేస్తున్నాం.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను అని వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ అరేనాలో 2nd ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ – 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సెంట్రల్ మినిస్టర్ అయ్యాక హైదరాబాద్ లో తొలి ఈవెంట్ కు హాజరయ్యాను.. ఇది నాకు మర్చిపోని రోజు అన్నారు. 2014 కు ముందు తరువాత ఏవియేషన్ లో అనేక వచ్చాయి..చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందని వెల్లడించారు. దేశంలో నాల్గవ అతిపెద్ద ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉంది..ఎందు కు ఇంత పెద్ద ఎయిర్ పోర్ట్ అన్నారు.. వరల్డ్ లోనే టాప్ 10 ఎయిర్ పోర్ట్స్ సరసన నిలిచిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్ట్స్ నిర్మాణానికి.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.