సీఎం కేసీఆర్.. సమైక్యవాదులు మానసికంగా వేధిస్తున్నారు – గుత్తా సుఖేందర్

-

సీఎం కేసీఆర్.. సమైక్యవాదులు మానసికంగా వేధిస్తున్నారని  గుత్తా సుఖేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల బిజెపి పంపిన బాణమేనని విమర్శలు చేశారు. ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమైక్యవాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కొంతమంది సమైక్యవాదులు సీఎం కేసీఆర్ పై విషయం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వైఎస్ షర్మిల కూడా కెసిఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తుందని నిప్పులు చెరిగారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక వనరులను కట్టడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఐటీ రైడ్స్ బీజేపీ వ్యూహంలో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఐటీ రైడ్స్ పేరుతో మంత్రులను ఇబ్బంది పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version