BREAKING : బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ !

-

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో టికెట్లు రాని నేతలు కాంగ్రెస్లో చేరితే… కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రానివారు గులాబీ గూటికి వస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ చాలా మంది కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు సమాచారం.

కాగా, ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు చేరబోతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఈరోజు బీఆర్ఎస్​లో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో జిట్టా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version