KTR కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

గులాబీ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. 47వ వసంతంలోకి కల్వకుంట్ల తారకరామారావు అడుగుపెడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Chief Minister Revanth Reddy congratulated KTR

తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు… గులాబీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
సిరిసిల్లా శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్‌ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version