గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన సంతాన సాఫల్య కేంద్రం

-

సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఐదో అంతస్తులోని తల్లిపిల్లల విభాగంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. దీంతో ఇకపై గాంధీ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండానే IVF పద్దతిలో సంతానం పొందే అవకాశముంది. సంతాన లేమితో ఎంతో మంది దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా స్థోమత లేకున్నా అప్పులు చేసి మరీ ప్రయివేటు క్లినిక్ లలో IVF కోసం ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోిక వచ్చాయి. కేవలం టెస్టులు, కౌన్సెలింగ్ తో పాటు ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్ పద్దతిలో సంతానం పొందేవిధంగా ప్రయత్నం చేసేవారు. ఈ ప్రక్రియలో భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్ లో శుద్ధి చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో ఇప్పటికే కొందరికీ సంతాన భాగ్యం దక్కింది. తాజాగా ప్రారంభమైన కేంద్రంలో రూ.5కోట్లతో అత్యాధునిక ఇన్ విట్రో ఫెర్టిలైజేసన్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈ పద్దతిలో ల్యాబ్ లోనే పిండాన్ని ఫలదీకరణ చేశాక మహిళా గర్భంలో ప్రవేశపెడతారు. ఐయూఐతో పోల్చితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స ప్రయివేటులో రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని.. గాంధీ ఆసుపత్రిలో మాత్రం దీనిని ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version