తెలంగాణలో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిరసనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకానికి సంబంధించి అవతవకలు జరుగుతున్నాయని పలు చోట్ల బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు నిరసనసెగ తగిలింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అంజనాపురం గ్రామానికి వచ్చిన రేగకు అసమ్మతి సెగ రాజుకుంది. అర్హులైన పేదలకు గృహలక్ష్మి ఇండ్లు నమోదు చేయకుండా బిఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు,ఉద్యోగస్తులకు గృహలక్ష్మి ఇండ్లు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు గ్రామస్తులు.
మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలు తీస్తున్న యువకుల సెల్ ఫోన్లు లాక్కొని డిలీట్ చేసిన బూర్గంపాడు పోలీసులు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామం లో ఉన్న మూడు కాలనీ వాసులకు దళిత బంధు పథకం ఇవ్వకుండా కేవలం ఒక కాలనీ వారికి మాత్రమే ఇచ్చి మిగిలిన రెండు కాలనీ వారిని విడగొట్టే ఆలోచనలో ఉన్నారని నిరసిస్తూ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ఫ్లెక్సీ వేసిన కాలనీవాసులు.