ములుగు జిల్లాలో ఈ నెల 31 వరకు సిటీ పోలీస్ యాక్ట్

-

ములుగు జిల్లా వాసులకు బిగ్ అలర్ట్. ములుగు జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు. ములుగు జిల్లాలో ఈ నెల 31 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ శబరీష్.

City Police Act in Mulugu district till 31st of this month
City Police Act in Mulugu district till 31st of this month

అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. బంద్ ల పేరుతో సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి తెచ్చినా, బెదిరించినా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్న ఎస్పీ శబరీష్.. ఈ మేరకు ములుగు జిల్లాలో ఈ నెల 31 వరకు సిటీ పోలీస్ యాక్ట్ ఉంటుందన్నారు.

  • ములుగు జిల్లాలో ఈనెల 31 వరకు సిటీ పోలీస్ యాక్ట్
  • శాంతిభద్రతల దృష్ట్యా సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ
  • అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని హెచ్చరిక
  • బంద్ ల పేరుతో సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి తెచ్చినా, బెదిరించినా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్న ఎస్పీ శబరీష్

Read more RELATED
Recommended to you

Latest news