దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి: సీఎం కేసీఆర్‌

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ కలిశారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేంద్ర సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర సర్కార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం అరాచకంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.

దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. దిల్లీలోనూ ఆప్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని కేసీఆర్ అన్నారు. దిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌ ద్వారా వేధింపులకు గురి చేస్తోందని.. కేంద్రప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఒక ఆర్డినెన్సు తెచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version