నూత‌న స‌చివాల‌యంలో నేడు సీఎం కేసీఆర్ తొలి స‌మీక్ష‌

-

తెలంగాణ నూతన సచివాలయం కొలువుదీరింది. అంగరంగ వైభవంగా అత్యంత అట్టహాసంగా పాలనా సౌధం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలో తొలి దస్త్రంపై సంతకం చేశారు. తన చాంబర్ లో ఆసీనులయ్యారు. ఈ క్రమంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ మ‌ధ్యాహ్నం తొలి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై కేసీఆర్ స‌మీక్షించ‌నున్నారు. కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ‌ల ప‌నుల‌పై కూడా కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం మ‌ధ్యాహ్నం ప్రారంభించ‌న విష‌యం తెలిసిందే. నిన్న ఆరు కీల‌క ద‌స్త్రాల‌పై కేసీఆర్ సంత‌కాలు చేసిన సంగ‌తి తెలిసిందే. మంత్రులు కూడా ఆయా ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేసి త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version