కాంట్రాక్టు ఉపాధ్యాయులను సీఎం కేసీఆర్ శుభవార్త

-

కాంట్రాక్టు ఉపాధ్యాయులను సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అటు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…. విద్యార్థుల్లో ఇమిడి ఉండే ప్రతిభను వెలికి తీసే పనిని తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version