నేడు నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ బీఆర్ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇవాళ మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో  కేసీఆర్ పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు భూపాలపల్లిలో బీఆర్ఎస్​ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును వివరిస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని గురి చేస్తూ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 25న జరిగే సీఎం కేసీఆర్  సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఆయన టీఎస్​ఐఐసీఛైర్మన్ గ్యాదరి బాలమల్లు తో కలిసి సభా వేదిక నిర్మాణం, భారికేడ్ ల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి  నుంచి ఇప్పటి వరకు 82 సభల్లో సీఎం పాల్గొన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే వాటిని ప్రజలకు కేసీఆర్ వివరిస్తున్నారు. ఇదే సందర్భంలో విపక్షాలు…. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వైఖరి, నేతల వ్యాఖ్యలను ఎండగడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version