శాంతి శ్లోకం చదివిన నిర్మలా సీతారామన్ ఆత్మ ద్రోహం చేస్తున్నారు. సిగ్గు లేకుండా మహాభారతంలోని శాంతి పర్వ శ్లోకాలు చెబుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. చెప్పేది ధర్మపాలన చేసేది అధర్మం అంటూ విమర్శించారు. మీరు దిక్కుమాలిన పార్టీ, ప్రభుత్వం ఈదేశానికి పట్టిన కుక్కమూతి పిందెలు అని తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. సిగ్గనిపిస్తలేదా… నిర్మలా సీతారామన్, మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని కోట్ చేస్తారా.. అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు అడుతుందని కేసీఆర్ విమర్శించారు.
కరోనా సమయంలో హెల్త్ బడ్జెట్ పెంచలేదని.. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదని ఆయన అన్నారు. బీజేపీని నమ్మి ఓటేస్తే అమ్మేస్తారని కేసీఆర్ విమర్శించారు. మత పిచ్చ లేపి జనాలను రెచ్చగొట్టడం బీజేపీ పాలన అన్నారు. ఎయిర్ ఇండియాను అమ్మేశారు… ఎల్ ఐ సీని అమ్ముతున్నామని నిసిగ్గుగా చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని.. పెట్టుబడి రెట్టింపు చేశారని మండిపడ్డారు. క్రిప్టో కరెన్సీని గుర్తించారా… ఎలా దానిపై పన్ను వసూలు చేస్తారని.. అవగాహన లేకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.