BREAKING : సాయిచంద్ భౌతిక కాయం వద్దకు సీఎం కేసీఆర్‌ !

-

 

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌస్ కు వెళ్లారు. రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే… సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. అంతేకాదు.. మరి కాసేపట్లోనే… సాయిచంద్ భౌతిక కాయం వద్దకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. అలాగే, ఆయన అంత్యక్రియల్లో కూడా సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version