కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్..!

-

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లకు ఈనెల 10 చివరి తేదీ కావడంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హెలికాప్టర్ లో కామారెడ్డికి చేరుకొని అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. కామారెడ్డిలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఆయన తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గంప గోవర్థన్ నివాసంలో నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. గ్రూపు తగాదాలు వీడాలని.. పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తప్పుడు సంకేతాలు వద్దని హెచ్చరించారు. కాగా కామారెడ్డిలో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరోవైపు కేసీఆర్ పోటీ గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేయడం విశేషం. ఈ ఎన్నికల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version