21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. దేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలి అని సూచించారు. ఇక సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోంది. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది.
ఉన్నత చదువులు చదివి భవిష్యత్ లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని… పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా. ఇక గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. 14 నవంబర్ న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమంతీసుకుంటున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయబోతున్నాం అని సీఎం రేవంత్ స్పష్టం చేసారు.