తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

-

తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సిఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోడంగల్ లో మెడికల్ నర్సింగ్ కాలేజీలో ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని కోరారు. ఏం సు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఉస్మానియా నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఏం సునో సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో వచ్చే సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హైకోర్టులో బెంచ్ పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం ఇష్యూ రానుందని.. కోర్టు డైరెక్షన్స్ ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎం ఎల్ఓసి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version