ఖైరతాబాద్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర లో పాల్గొనబోతున్నారు. సచివాలయం ముందుకు ఖైరతాబాద్ విగ్రహం వచ్చిన తర్వాత…. అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శోభాయాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణపతి.. శోభయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా శోభాయాత్రలో పాల్గొనలేదు. అయితే రేవంత్ రెడ్డి ఈ శుభ యాత్రలో పాల్గొనడంతో జనాలు… విపరీతంగా వస్తారని పోలీసులు టెన్షన్ పడుతున్నారు.

కాగా, ఢిల్లీకి పోతే కూడా రాజకీయం చేస్తున్నారు..అదేమైనా పాకిస్థాన్ లో ఉందా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం జరిగింది. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి..అనంతరం మాట్లాడారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version